పోలవరం కోసం 2014 నుంచి ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేసినట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. పోలవరం కోసం కేంద్రం రూ.17860 కోట్లు చెల్లించిందని.. ప్రాజెక్టుల వల్ల 96,660 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు తొలిదశలో రూ.1,203 కోట్లు అందించామని వెల్లడించారు.
ఇంకా 18,266 కుటుంబాలకు రూ.1340 కోట్లు చెల్లించాలి. ఇప్పటివరకు 12,263 కుటుంబాలను తరలించాలి. 75 నిర్వాసితుల కాలనీలలో 49 నిర్మాణంలో ఉన్నాయని.. అవి ఆగస్టులోపు భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలిదశ ఆర్అండ్ఆర్ ను 2026 జూన్ లోపు పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎత్తును జగన్ హయాంలోనే రెండుగా విభజించారు. పోలవరానికి 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్ నే అడగాలి. నిర్వాసితుల కాలనీలలో ఒక్క ఇంటికీ ఆయన హయాంలో పునాది వేయలేదని నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు.