లోకేష్‌ కు షాక్‌..మంగళగిరి నేతలతో జగన్ సమావేశం

-

నారా లోకేష్‌ కు షాక్‌..మంగళగిరి నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టంచేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలని వెల్లడించారు. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలని… ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని పేర్కొన్నారు.

Jagan’s meeting with Mangalagiri leaders

అన్నిటికీ తట్టుకుని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిగారిని ఇన్‌ఛార్జిగా నియమించామని… రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికీ మనం మంచిచేశామని… ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టే పార్టీ వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version