అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం జగన్ పై దాడి అనంతరం పార్టీల మధ్య డైలాగ్ వార్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు.
‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన అనే తేడా లేదు. సింపతీతో సీఎం సీటు దక్కించుకోవాలని బాబాయ్ని లేపేశాడు. అదే సమయంలో కోడి కత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డలను బలి చేయాలని చూస్తున్నాడు. జగన్ ‘నా’ అన్నాడంటే నాశనం చేసేస్తాడని అర్థం. నా ఎస్సీలు అన్నాడు, వందలాది మందిని బలిచ్చాడు. నా బీసీలు అన్నాడు, వేలమంది బలైపోయారు. ఈ జగన్ నాటకానికి జనమే చరమగీతం పాడుతారు.’ అని ట్వీట్ లోకేష్ చేశారు.
అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన,మన అనే తేడా లేదు. సింపతీతో సీఎం సీటు దక్కించుకోవాలని బాబాయ్ని లేపేశాడు. అదే సమయంలో కోడికత్తి డ్రామాతో దళితులను వేధించాడు. తీవ్రమైన ప్రజావ్యతిరేకతలో ఓటమి ఖాయమైపోవడంతో గులకరాయి డ్రామాకి బీసీ బిడ్డల… pic.twitter.com/D6yh5ndEOG
— Lokesh Nara (@naralokesh) April 17, 2024