జనసేన పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో జనసేన కార్యకర్త మృతి చెందాడు. చెన్నైలోని మురికి కాలువలో శవమై కనిపించాడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్నాడు రాయుడు.

రాజకీయ ప్రత్యర్థులతో కలిసి తమపై రాయుడు కుట్ర చేశాడని వినూత ఆరోపణలు చేశారు. కొద్ది రోజుల క్రితం రాయుడిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఇక రాయుడికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వినూత. ఇక రాయుడు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో జనసేన కార్యకర్త మృతి చెందిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.