రక్త క్యాన్సర్: ఈ ముందస్తు సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి

-

రక్త క్యాన్సర్ రక్తం, ఎముక మజ్జ, శోషరస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంటే బ్లడ్ క్యాన్సర్ అనేది బోన్ మ్యారోలో మొదలై రక్త కణాలపై ప్రభావం చూపే క్యాన్సర్. లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి వివిధ రకాల రక్త క్యాన్సర్లు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్‌ను తరచుగా ముందుగానే గుర్తించగలిగినప్పటికీ, శరీరం స్వయంగా కొన్ని లక్షణాలను చూపుతుంది.

ల్యుకేమియా ఉన్నవారిలో, రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం బాగా తగ్గిపోతుంది. ఇది రక్తహీనత, అలసటకు దారితీస్తుంది. కాబట్టి నిత్యం అలసటగా, తలతిరుగుతున్నట్లు అనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలసట అనేక వ్యాధుల లక్షణం. వివరించలేని బరువు తగ్గడం కూడా లుకేమియాకు సంకేతం. రక్త క్యాన్సర్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది ఆకస్మిక ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. అలాగే ఎముకలు లేదా కీళ్లలో నిరంతర నొప్పిని విస్మరించవద్దు. మీరు నిరంతరం అలాంటి అసౌకర్యాన్ని అనుభవిస్తే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

చిన్న కోతల వల్ల ఎక్కువ కాలం రక్తస్రావం అవుతుండడాన్ని కూడా తేలికగా తీసుకోకూడదు. ముక్కు, నోరు, మలద్వారం మరియు మూత్రనాళాల నుండి అసాధారణ రక్తస్రావం కూడా దీని లక్షణం. తరచుగా ఛాతీ నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం బ్లడ్ క్యాన్సర్ లక్షణం. లుకేమియా ఉన్న వ్యక్తికి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జ్వరం, తలనొప్పి, దద్దుర్లు మరియు చర్మం మరియు నోటిపై పుండ్లు ఉన్నాయేమో గమనించాలి. రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడాన్ని తేలికగా తీసుకోకూడదు.

రోగాలు పెద్దగా ఉంటాయి.. కానీ వాటి సంకేతాలు సాధారణంగా ఉంటాయి.. అవి అసలు ఇంత పెద్ద రోగాలకు సంకేతాలు అని మనం ఊహించలేం.. ఒక మాత్ర వేసుకుంటే తగ్గుతుందిలే అనుకుంటాం..ఆ మాత్రలు లోపల సమస్యను కప్పిపెడతాయి అంతే.. తగ్గించవు.. ఇలాంటి లక్షణాలు ఉంటే.. సొంత వైద్యం చేసుకోకుండా.. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్‌ వంటి వ్యాధులను త్వరగా గుర్తిస్తేనే.. చికిత్స త్వరగా మొదలుపెట్టవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news