జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిరెడ్డికి కొత్త చిక్కులు వచ్చాయి. తాజాగా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మిరెడ్డి పై కేసు నమోదు అయింది. జనసేన నేత కిరణ్ రాయల్ సంబంధించిన ఫోటోలను లక్ష్మి, పసుపులేటి సురేష్ తో కలిసి మార్ఫింగ్ చేశారని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

లక్ష్మికి ఇవ్వవలసిన 35 లక్షలు ఇచ్చినా కూడా మరో 90 లక్షలు ఇవ్వాలని … లేకపోతే పరువు తీస్తానని బెదిరిస్తుందని కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఇక కిరణ్ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 69/ 2025 ,308(3),351 (2 ) ఐపీసీ సెక్షన్ లతోపాటు బి.ఎన్. ఎస్ యాక్ట్ ,66(D) ఐ టి యాక్ట్ కింద… లక్ష్మి, పసుపులేటి సురేష్ పై కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు…ఈ మేరకు ప్రకటన చేశారు.