మాజీ  జెడ్పీటీసీ అరెస్టు..  అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి ఇంట్లో చొరబడి!

-

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ దళిత మాజీ ZPTC అన్నేపర్తి శేఖర్‌ను గురువారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోకి చొరబడి, తలుపులు పగులగొట్టి, దౌర్జన్యం చేసి, భయబ్రాంతులకు గురిచేసి  పోలీసులు అరాచకం సృష్టించారని బాధిత కుటుంబ సభ్యులు  చెబుతున్నారు.

ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ప్రశ్నించగా.. అరెస్ట్‌పై తమకు సమాచారం లేదని సమాధానం వచ్చినట్లు తెలిసింది.  అయితే, శేఖర్‌ను ఎవరు అరెస్ట్ చేశారు? ఎక్కడికి తీసుకుపోయారు? తమకు చెప్పాలని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పీఎస్ వద్ద నిలబడి శేఖర్ ఆచూకీ చెప్పాలంటూ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news