బీఆర్‌ఎస్‌ పార్టీకి 100 సీట్లు రావడం గ్యారెంటీ – మాజీ మంత్రి

-

ఎన్నికలు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీకి 100 సీట్లు రావడం గ్యారెంటీ అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అటు రేవంత్ రెడ్డి సర్కార్‌ పై మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు బీఆర్ఎస్‌ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డిని దించడానికి 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు అంటూ బాంబ్‌ పేల్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

errabelli-dayakar-rao on BRS

గత 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, మరో 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పథకాల పేర్లు మార్చి ఎంతో అభివృద్ధి చేసినట్లు కాంగ్రెస్ గొప్పలు చెప్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు సమన్వయం కొరవడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news