రేపు నామినేషన్‌ వేయనున్న పవన్‌కల్యాణ్‌

-

ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురేంధశ్వరి నామినేషన్ వేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామపత్రాలు సమర్పించారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 23వ తేదీ (మంగళవారం)న పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలి వెళ్లి పవన్‌ నామినేషన్‌ వేస్తారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version