50 మందితో అశ్లీల నృత్యాలు.. జనసేన నేత సస్పెండ్ !

-

50 మందితో అశ్లీల నృత్యాలు ఏలూరులో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… జనసేన నేత సస్పెండ్ అయ్యారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో యువ నాయకుడు వాకమూడి ఇంద్ర జన్మదినం సందర్భంగా రైస్ మిల్లులో రేవ్ పార్టీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు బయటపడ్డాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

janasena

దీంతో… జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో 17 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నృత్యాలలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హిజ్రాలను తీసుకొచ్చి ఫుల్లుగా మద్యం హిజ్రాలను నగ్నంగా ఉంచి చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరునంలోనే.. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంద్రకుమార్ సస్పెండ్ చేస్తున్నట్లు నిడమర్రు మండల జనసేన అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version