పుంగనూరు నియోజక వర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పుంగనూరులో జనసేన బహిరంగ సభ పెట్టనున్నారు. నేడు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలో జనంలోకి జనసేన బహిరంగ సభ ఉండనుంది. మంగళంపేట అటవీశాఖ భూ అక్రమాలు విచారణలో సమయంలో నాగబాబు పర్యటన ఉండనుంది.
ఇందులో భాగంగానే… సోమల మండల కేంద్రంలో జనంలోకి జనసేన బహిరంగ సభ ఉండనుంది. ఇక ఈ జనంలోకి జనసేన బహిరంగ సభకు నాగబాబు, ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు ,హరిప్రసాద్, కిరణ్ రాయల్ సహా ఇతర నేతలు…హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లేకుండానే…చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలో జనంలోకి జనసేన బహిరంగ సభ ఉండనుందని సమాచారం.