Coolie Movie Review: రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం “కూలీ”. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కూలి సినిమాను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కాకుండా స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా రూపొందించారు. కూలి సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటించారు. వీరితోపాటు ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ అందుకుంది.

కూలి సినిమా కథ:
సైమన్ (నాగార్జున) విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకొని కింగ్ పిన్ లాజిస్టిక్ పేరుతో బంగారంతో పాటు లగ్జరీ వాచ్ లను స్మగ్లింగ్ చేస్తూ వ్యాపారం కొనసాగిస్తాడు. అతని కోసం పని చేసే దయాల్ (సౌబిన్ షాహీర్) దయ అనేది లేకుండా అరాచకంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) మరణిస్తాడు. అయితే అది సహజ మరణం కాదని భావించిన దేవా (రజినీకాంత్) ఆ మరణానికి గల కారణాలను తెలుసుకొనేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో రాజశేఖర్ ను చంపింది ఎవరో తెలుస్తుంది. కానీ అతను ఎందుకు చంపాడు. అసలు రాజశేఖర్, దేవా బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే వివరాలు సినిమాను చూసి తెలుసుకోవాలి.
పాజిటివ్ పాయింట్స్:
రజనీకాంత్ నటన
అనిరుద్ మ్యూజిక్
ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది
ఫైట్ సీన్లు
నెగిటివ్ పాయింట్లు:
సెకండ్ ఆఫ్ కాస్త బోరింగ్ గా అనిపించింది
డైరెక్షన్లో లోపం
సినిమాలో కాస్త గందరగోళం నెలకొంది
రేటింగ్: 2.5/5