జవాన్ మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనుంది చంద్రబాబు నాయుడు సర్కార్. జవాన్ మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు నారా లోకేష్. మురళి నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నామని ప్రకటించారు. వీర జవాన్ మురళీ నాయక్‌కు నివాళులర్పించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్.

మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి.. అనంతరం కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు.
5 ఎకరాల భూమి, ఇంటి కోసం 300 గజాల స్థలం ఇస్తామని పేర్కొన్నారు. మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. మురళి నాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించామని ఇచ్చారు నారా లోకేష్. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు నారా లోకేష్.