కాల్పుల విరమణను నమ్మలేమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన 3 గంటలకే వక్ర బుద్ధి ప్రదర్శించిందని ఫైర్ అయ్యారు. జవాన్ మురళి నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సహాయం ప్రకటించారు పవన్ కళ్యాణ్.

కాగా అంతకు ముందు మురళీ నాయక్ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి.. అనంతరం కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు.