బ్రేకింగ్ : చంద్రబాబు కస్టడి పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రేపటితో ముగియనుంది. చంద్రబాబు పై అంగళ్లు కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది. ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబును 5 రోజుల కస్టడికి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని వాదించింది సీఐడీ. అన్ని ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని.. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడమే అసలు ఉద్ధేశం అన్నారు. కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపున న్యాయవాది లూథ్రా వాదించారు. నిన్ననే వాదనలు పూర్తయ్యాయి. రేపు ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్టు ఏసీబీ కోర్టు తాజాగా పేర్కొంది. ఇవాళ 4 గంటల నుంచి చంద్రబాబు కస్టడీ తీర్పు గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. 5 గంటల బెంచ్ పైకి వచ్చిన జడ్జీ.. రిమాండ్ అంశాన్ని కూడా పరిశీలించి.. రేపటికి వాయిదా పడింది. రిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కస్టడికి సంబంధించిన తీర్పు ఎలా ఇవ్వాలనేది చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version