టీడీపీకి పవన్ కళ్యాణ్ దిక్కా ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి. దాదాపుగా నలభై సంవత్సరాల పాటు టీడీపీని వెనకుండి నడిపించిన నేత సీనియర్ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గత రెండు వారాలుగా స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి రాష్ట్రంలో టీడీపీ నేతలు, క్యాడర్ అంతా కూడా అయోమయంలో పడిపోయారు. ఇంతకాలం ఎవరైతే పార్టీకి దైర్యంగా ఉన్నారో ? వారే ఇపుడు జైల్లో ఉండడంతో అందరూ ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో టీడీపీని ముందుండి నడిపేది ఎవరు.. నారా లోకేష్ ? బాలకృష్ణ ? లేదాయే మరెవ్వరైనా అంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర సమాధానమే లేదని చెప్పాలి. కానీ ఒకవర్గం ప్రజలు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక బాధ్యత తీసుకుని ముందుండి నడిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

అంతే కాకుండా రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. మరి ఇక టీడీపీ కి పవన్ కళ్యాణ్ దిక్కా అంటే అవుననే తెలుస్తోంది. మరి సమయం ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version