జూనియర్ అంటేనే చిరాకు పడుతున్న చంద్రబాబు

-

అవ్వ వద్దు బువ్వ కావాలి అన్నట్టుంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఎన్టీర్ పెట్టిన పార్టీ కావాలి కానీ ఆ సౌండ్ అంటేనే చంద్రబాబుకి పడి చావడం లేదు.ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకే కాదు టీడీపీ కేడర్ కూడా ఆఖరికి ఆ బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. నందమూరి అభిమానుల సపోర్ట్ కావాలి .. వారి ఇమేజి పార్టీకి కావాలి కానీ నందమూరి వారి ఉనికి మాత్రం పార్టీలో ఉండకూడదు అనేది చంద్రబాబు అండ్ కో ఉద్దేశంగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవని లోకేష్ మాత్రమే పార్టీకి సారధ్యం వహించాలి.. అయన నినాదాలే వినిపించాలి.. అయన పేరే కనిపించాలి..కానీ ఎన్టీఆర్ స్మరణే అక్కర్లేదు వాళ్ళకి
ఒకవేళ వాళ్ళ పేరు వినిపించిందే అనుకో ఇక దాడి మొదలైనట్టే. ఆఖరికి బుడ్డోడు.. చిన్న ఎన్టీయార్ అంటే కూడా చంద్రబాబు అండ్ పార్టీకి నచ్చడం లేదు. టిడిపి .. ముఖ్యంగా లోకేష్, చంద్రబాబుల అభిమానులు రగిలిపోతుంటారు. టిడిపి సభల్లో.. సమావేశాల్లో ఎక్కడైనా నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ పేరు వినిపిస్తే శివాలెత్తిపోవడం చాలాసార్లు గమనించాం.

ఎక్కడికి వెళ్లినా అదే జెలస్. ఇప్పుడు అమెరికాలోను అసూయ చూపించారు టీడీపీ వాళ్ళు. ప్రస్తుతం అమెరికాలో ఫిలడెల్ఫీయాలో తానా సభలు జరుగుతున్నాయి. దీనికి పలువురు టిడిపి అభిమానులు ఆంధ్రానుంచి వెళ్లగా.. అమెరికాలో ఉండే టిడిపి కార్యకర్తలు.. చంద్రబాబు అభిమానులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భముగా జూనియర్ ఎన్టీయార్ అభిమాని ఒకరు జై ఎన్టీయార్ అని నినదించడంతో లోకేష్.. చంద్రబాబుల అభిమానులు ఆయనమీద పడి విచక్షణారహితంగా కొట్టేశారు. టిడిపి యువత రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిమీద ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. అత్యంత క్రమశిక్షణ పాటించే పార్టీగా ఉండే టీడీపీలో ఈ రచ్చ ఇప్పుడు పరువు పోయేలా చేసింది

ఈ సభ టిడిపికి హైప్ తేవడానికి ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ జూనియర్ ప్రస్తావన ఎందుకు అనేది టీడీపీ వీరాభిమానుల ప్రశ్న. అందుకే ఆ యువకుడిపై దాడి చేశారు.అసలు తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీయార్ ఆనవాళ్లు, ఉనికి అవసరం లేదని.. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టిడిపి భావిస్తున్నట్లు తేలుస్తోంది. అందుకే వీలైనప్పుడల్లా జూనియర్ ను , అయన అభిమానులను సైతం అవమానిస్తున్నారు. ఇటీవల గుడివాడలో చంద్రబాబు సభలో కొందరు అభిమానులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ ఫోటోలు ప్రదర్శించి జోహార్ హరికృష్ణ అని నినాదాలు చేయగా వారిమీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీయార్ శత జయంతి సభ విజయవాడలో నిర్వహించినా జూనియర్ కు పిలుపు రాలేదు. మొత్తానికి అయన ఉనికి చంద్రబాబు అండ్ కో లకి ప్రమాదం అనుకున్నారేమో జూనియర్ అనే సౌండ్ వినిపిస్తే తెగ కోపం తెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version