ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నట్లు… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాల వరద బాధితులకు… జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన చెక్కులను నేరుగా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందజేయాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారట.
రేవంత్ రెడ్డిని కలిసే కంటే మొదటగా… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ను కలవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారట. అయితే ఒంటరిగా వెళ్లకుండా టాలీవుడ్ పెద్దల తో కలిసి…. చంద్రబాబు నాయుడు ను కలవాలని అనుకుంటున్నారట. ఈ సందర్భంగా విరాళాలు ప్రకటించిన చెక్కులను అప్పగించనున్నారట. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు కూడా చెప్పబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు.