జూనియర్ పవన్ అంటూ అకిరాపై ఫ్యాన్స్ కామెంట్స్.. రేణు దేశాయ్ ఫైర్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ విజయం సాధించిన అనంతరం తన వారసుడిగా తనయుడు అకిరాను అందరికీ పరిచయం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిచయం చేయగా.. నిన్న ఏకంగా ప్రధాని మోడీని ఫ్యామిలీతో సహా కలిసి భేటీ అయ్యారు. అకిరా పవన్ వెంటే ఉన్నాడు. ఫ్యాన్స్ జూనియర్ పవన్, PSP2 అని కామెంట్స్ చేస్తున్నారు.

అభిమానులు కామెంట్స్ పై రేణు దేశాయ్ స్పందిస్తూ.. అకిరాను జూనియర్ పవన్ కళ్యాణ్ అంటూ పిలిచిన నెటిజన్లపై ఆమె ఫైర్ అయ్యారు. “అకిరాకు, తన తండ్రికి  గాని తాను జూనియర్ పవన్ కళ్యాణ్ అనిపించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి తన ఫీలింగ్ని అర్థం చేసుకోని అకిరా నందన్ అని పిలవండి” అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే మరో పోస్ట్ లో అకిరా యాక్టింగ్ డెబ్యూ పై స్పందిస్తూ.. అకిరా పుట్టిన క్షణం నుంచి నేను తన అభిమానిగా ఉన్నాను. అతడు ఎప్పుడెప్పుడు నటిస్తాడా అని నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కానీ అంతకంటే ముందు తల్లిగా అతని నిర్ణయాన్ని, ఫీలింగ్స్ ని గౌరవించాలి. కాబట్టి తరచూ అకిరా సినీరంగ ప్రవేశంపై డిస్కషన్ చేస్తూ నాకు చిరాకు తెప్పించకండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version