రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జూనియర్ నాయకు లు సీనియర్ల కంటే ఎక్కువగా చక్రం తిప్పుతున్నారు. ఈ జూనియర్ నేతల్లో వారసులు, వ్యాపార రంగాల వారు కూడా ఉన్నారు. జూనియర్లు చాలా జిల్లాల్లో విజయం సాధించారు. ఇక, సీనియర్లలో అనేక మంది పరాజయం పాలయ్యారు. అయితే, రాజకీయాలు చేయడానికి గెలుపు ఓటములతో సంబంధం ఏముంటుం ది. గతంలో ఎప్పుడో గెలిచి తర్వాత ఓడిన నాయకులు చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో ఓడిన, గెలిచిన సీనియర్ల కంటే కూడా జూనియర్లు దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
గుంటూరు, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఈ వరుసలో ముందున్నాయి. మరీ ముఖ్యంగా గుంటూరులో జూనియర్ నాయకులు సీనియర్లను దాదాపు పక్కన పెట్టారు. వైసీపీలో జూనియర్లు ఒక రేంజ్‌లో రాజకీయాలు చేస్తున్నారు. వీరిలో ఒకరిద్దరు మంత్రులు కూడా ఉండడంగమనార్హం. ఎంపీలు కూడా ఉన్నారు. స్థానిక సమస్యలపై పట్టు పెంచుకుంటున్నారు. అదేసమయంలో ప్రజలతోనూ మమేకం అవుతున్నారు. ఇక, ప్రభుత్వంతోనూ టచ్‌లో ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ అవసరం వచ్చినా మేమున్నామంటూ ముందుకు సాగుతున్నారు.
ఇది మంచిదే.. అయితే, అదేసమయంలో సీనియర్లను లెక్క చేయకుండా ముందుకు వెళ్లడం, వారికి ఎలాంటి విలువ కూడా ఇవ్వకపోవడం వంటి పరిణామాలను గమనిస్తే.. మాత్రం జూనియర్లు తమ దూకు డు పెంచడం సమంజసంగా లేదని అంటున్నారు పరిశీలకులు. జూనియర్ల కోసం సీనియర్లు చేసిన త్యాగాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదేసమయంలో ఒక్క గెలుపుతోనే ఏదో సాదించామని అనుకోవడం కూడా సరికాదని, మున్ముందు ఎదగేందుకు ఒదిగి ఉండాలనే సూత్రాన్ని అనుసరించడమే మేలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ పరిణామం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం గమనార్హం.