వైసీపీ సెంట్రల్ ఆఫీసులో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం

-

తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు కార్మూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..బ్రిటీష్ కాలంలోనే మహాత్మా అనే బిరుదును పొందారని..ఈ దేశానికి స్ఫూర్తి పూలే అని కొనియాడారు.

Jyoti Rao Phule’s funeral program at YCP Central Office

అణగారిన వర్గాలకు దిక్సూచి అని.. పూలే మార్గంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు. బీసీనే అయినా నాకు 130 కులాలు ఉన్న విషయం నాకు కూడా తెలియదు…కార్పొరేషన్ల ఛైర్మన్లకు రూమ్ లు ఉన్నాయా? కుర్చీలు ఉన్నాయా అని అడుగుతున్నారని చెప్పారు. కుర్చీ, రూం ఇచ్చి ఫ్యాన్ వేసుకుని పడుకోమని కాదు…బీసీ వర్గాల్లో నాయకత్వం పెంచటానికే జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version