మాజీ సీఎం వైఎస్ జగన్ పై కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు క్రిస్టియన్ కాదు.. చిన్న జీయర్ భక్తుడు అంటూ బాంబు పేల్చారు కే.ఏ.పాల్. నా ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే జగన్ చిత్తుగా ఓడిపోయారు అంటూ పేర్కొన్నారు కే.ఏ.పాల్.
అటు కూటమి ప్రభుత్వానికి కే.ఏ.పాల్ డెడ్ లైన్ విధించారు. రెండు నెలలు టైం ఇస్తున్నా. RDT సంస్థకు తిరిగి FCRA తీసుకురావాలన్నారు. లేకపోతే ప్రపంచాన్ని దించుతానని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్రంలోని నెం.2ని కలిసి మాట్లాడాను.. రాయలసీమ నుంచి అనేక మంది సీఎంలు అయినా ఈ ప్రాంతానికి ఏం చేయలేదని తెలిపారు.