చంద్రబాబుకు షాక్..గన్ మెన్లను వెనక్కి పంపిన కడప ఎమ్మెల్యే

-

కడప ఎమ్మెల్యే మాధవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు కేటాయించిన గన్ మెన్ సౌకర్యాన్ని తిరస్కరించారు కడప ఎమ్మెల్యే మాధవి. ఎన్నికల ముందు కడప ఎమ్మెల్యే మాధవికి 1 ప్లస్ 1 గన్ మెన్ లను కేటాయించారు ఏపీ పోలీసులు. ఎన్నికల అనంతరం కడప ఎమ్మెల్యేగా గెలిచిన మాధవికి మరో ఇద్దరు గన్మెన్లను కేటాయించారు అప్పటి కడప ఎస్పీ. ఇక టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి ఎన్నికల ముందు వన్ ప్లస్ వన్ గన్ మెన్ లను కేటాయించారు పోలీసులు.

MLA Madhavi Reddy

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రస్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలో పలువురికి గన్ మెన్ లు తొలగించారు. అందులో భాగంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి కూడా గన్ మెన్ లను తొలగించారు పోలీసులు. ఇక ఇటు కడప ఎమ్మెల్యే మాధవికి 2 ప్లస్ 2 నుంచి వన్ ప్లస్ వన్ కి గన్ మెన్ ల కుదించారు.

తన భర్త టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి గన్ మెన్ సౌకర్యం తొలగింపు పై అసహనం వ్యక్తం చేస్తూ తన గన్ మెన్ లను తిరస్కరించారు ఎమ్మెల్యే మాధవి. కడప ఎమ్మెల్యే మాధవికి సెక్యూరిటీ గా వెళ్లిన గన్ మెన్ లు విజయవాడ నుంచి వెనుతిరిగారు. ఇప్పుడు ఈ అంశం హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news