వైసీపీ ఆపార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అరెస్ట్ అయ్యాడు. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు, వైసీపీ నేత అహ్మద్ బాషాను అరెస్టు చేశారు కడప పోలీసులు. నిన్న ముంబైలో అరెస్టు చేసి విమానంలో బెంగళూరుకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన కడపకు తరలించారు.

కాసేపట్లో కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు పోలీసులు. గతంలో కడప తాలుకా పోలీస్ స్టేషన్ లో అహ్మద్ బాషాపై కేసు నమోదు అయింది. ఇక తాజాగా మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అరెస్ట్ అయ్యాడు.