తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అంటే మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట,

మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం.. నాగర్‌కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు గత నాలుగు రోజులుగా విపరీతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు కొడు తూనే ఉన్నాయి. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతల విపరీతంగా పెరిగిపోతున్నాయి. వడగాలను కూడా వీస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రెండు రోజులపాటు వర్షాలు పడనున్నట్లు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.