పంటల ప్రోత్సాహకాలకు సబ్సిడీ శాతం పెంచాం: కాకాణి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పంటల ప్రోత్సాహకాలకు సబ్సిడీ శాతం పెంచినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, సాధారణం కంటే 15% వర్షపాతం తగ్గిందని వెల్లడించారు. ఖరీఫ్ పంట నైరుతి రుతుపవనాల పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేని లోకేష్ కూడా లేఖలు రాయడం ప్రారంభించారు…ఎన్నికలు వస్తున్నాయని ఏదో ఒకటి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏమి చేశారో చెప్పండి..రైతులకు జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని వివరించారు మంత్రి కాకాని గోవర్ధన్.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరువు రావాలని పచ్చ మీడియా కోరుకుంటోంది…పచ్చ పేపర్లు టిడిపి కరపత్రాలుగా మారాయన్నారు. గతంలో రైతుల ఇబ్బంది పడినప్పుడు ఈ పత్రికలు ఏం చేశాయి… రైతులకు అండగా నిలవాలని లక్ష్యంతోనే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version