పరారీలో మాజీ మంత్రి కాకాణి.. పోలీసుల గాలింపు!

-

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఏపీ పోలీసులకు దొరకడం లేదు. ఆదివారం నాడు నెల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకెళ్లగా కాకాణి అక్కడ అందుబాటులో లేరు. దీంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయారు. ఇక హైదరాబాద్ లో ఉన్నారేమో అని ఆయన నివాసానికి వెళ్తే అక్కడ కూడా ఆయన అందుబాటులో దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులకు సంబంధిత నోటీసులు అందజేశారు.

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణ రేపటికి వాయిదా పడింది. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నిన్న నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లగా.. అక్కడ కూడా కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే కాకాణి.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ తోపాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ జరుపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news