నరికి ‘డ్రమ్‌’లో కుక్కుతా.. భర్తను చితక్కొడుతూ భార్య వార్నింగ్‌

-

ఈమధ్య భర్తలపై భార్యల వేధింపుల ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భర్తను భార్య హత్య చేసిన కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓ మహిళ తన భర్తను కర్రతో చితకబాది.. సంచలనం సృష్టించిన మీరట్ తరహా హత్య మాదిరి అతడిని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ లో కుక్కుతానంటూ బెదిరించింది. ఆ మహిళ ఇలా బెదిరింపులకు పాల్పడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఝాన్సీకి చెందిన జూనియర్ ఇంజనీర్ (జేఈ) ధర్మేంద్ర కుష్వాహ, మాయా మౌర్యలది ప్రేమ వివాహం. అయితే తన భార్య ఆమె బంధువువు నీరజ్ మౌర్యకు దగ్గరైందని.. కరోనా సమయంలో నీరజ్ భార్య మరణించడంతో వారిద్దరి మధ్య సంబంధం మరింతగా పెరిగిందని ధర్మేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓసారి తన భార్య, నీరజ్ సన్నిహితంగా ఉన్నప్పుడు చూసి ఆమెను కొట్టగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. అయితే మార్చి 29న తన భార్య మాయ ప్రియుడు నీరజ్‌తో కలిసి తనతో పాటు తన తల్లిని కొట్టారని ధర్మేంద్ర కుష్వాహ ఆరోపించాడు. అంతే కాకుండా మీరట్‌ హత్య మాదిరిగా ముక్కలుగా నరికి డ్రమ్‌లో కుక్కుతానని ఆమె హెచ్చరించిందని ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా భార్య తనను కొట్టిన సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news