రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేదు..!

-

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి.. విలువలు లేకుండా పోయాయి అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరులో మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం పై దాడి హేయమైన చర్య. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం, జిల్లాలో ఒక పరిస్థితి ఉంటే.. సర్వేపల్లి నియోజవర్గంలో పరిస్థితి మరోలా ఉంది.

20 సంవత్సరాల తరవాత గెలిచిన సోమిరెడ్డి ప్రజలకు మంచి చేసే పనులు విస్మరిస్తున్నారు. సోమిరెడ్డి.. ఆయన కొడుకు రెండు సంచులు పట్టుకొని సాయంత్రానికి సంచుల నిండా డబ్బుతో ఇంటికి వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి అవుతున్నా సోమిరెడ్డి చేసింది శూన్యం. లేఔట్ యజమానులను గందరగోళం చేసి వాళ్ల దగ్గర మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. ఇన్నిరోజులు సోమిరెడ్డి కి చెవుడు అనుకున్నాం కానీ ఈ మధ్య పిచ్చికూడా పట్టింది. అలాగే అరిచే కుక్క కరవదు అనే సామెత మాదిరిగా సోమిరెడ్డి అరుపులే తప్ప వాటిలో పస లేదు అని కాకాణి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version