జగన్ హయాంలోనే మాదిగలకు అనేక మేలు జరిగింది. కానీ మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు.. అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు . మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు, మంద కృష్ణ చూస్తున్నారు అని అన్నారు.
అయితే మాల, మాదిగలను రెండు కళ్లుగా జగన్ చూశారు. చంద్రబాబు లాగ రాజకీయాలకు వాడుకోలేదు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుని మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ జగన్ ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు. అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలాగ చూడాలి . కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.