వక్ఫ్ చట్ట సవరణపై మైనార్టీ మంత్రి ఫరూఖ్ సంచలన వాఖ్యలు చేసారు. మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు మతసంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు అని పేర్కొన్నారు. మత గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహారించాల్సింది పోయి స్వతంత్ర నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరి కాదు. విలువైన భూములను హస్తగతం చేసుకోవడం కోసం రైల్వే సంస్థ, డిఫెన్స్ ఆస్తుల్లా చేస్తామంటే కుదరదు అని ఫరూఖ్ అన్నారు.
గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి విలువైన భూములను జగన్ ఖాజేయ్యాలని చూసారు. ఇప్పుడు మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు. త్వరలో పార్లమెంట్ కమిటీ భేటీ అవుతుంది. మార్పులు చేర్పులు చేశాక చూస్తాం. వక్ఫ్ చట్ట సవరణపై భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశమంతా మనవైపే చూస్తోందని సీఎం చంద్రబాబుకు చెప్పాం. అందుకే చట్ట సవరణ నిలుపుదల చేయించాం అని మైనార్టీ మంత్రి ఫరూఖ్ పేర్కొన్నారు.