భక్తులకు అలర్ట్.. 18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

-

భక్తులకు అలర్ట్.. 18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చవితి రోజున ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Kanipakam Brahmotsavam from 18

ఆ తర్వాత హంస, మయూర, మూషిక, చిన్న, పెద్ద శేష, వృషభ, గజవాహన, అశ్వవాహన, ఏకాంత సేవలను నిర్వహించనున్నారు. కాగా, ఏపీ రైతులకు అలర్ట్..రైతుల ఖాతాలకు ఈ- కేవైసీ తప్పనిసరి అని ఏపీ సర్కార్‌ ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 3.13 లక్షల రైతుల ఖాతాలు ఈ-కేవైసీలు పెండింగ్ లో ఉన్నాయని… వాటిని త్వరగా పూర్తిచేయాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రతి విడతకు ఈ-కేవైసీ ఉంటేనే రైతులకు నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ నెలాఖరు లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎస్ సూచించారు. ఇప్పటివరకు 38.56 లక్షల మంది రైతుల ఖాతాలకు ఈ-కేవైసీ పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version