కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రఘురామ కృష్ణంరాజునుద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో రఘురామ ఎంతో బాధించారు. సుప్రీంకోర్టు జడ్జీలను, కార్యకర్తలను వదలలేదు. స్వయాన వైసీపీ తరుపున గెలిచి ఎంపీ అయిన రఘురామను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఎంపీ అరెస్ట్ విషయంలో నాకు భయం వేసిందని తెలిపారు. క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే ఇలాగే ఉంటుందని ఆరోజు అనిపించిందని తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని అనుకున్నాను. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా మీరు అక్కడ కూర్చుంటే గర్వకారణంగా ఉంది. సోషల్ మీడియా యాక్టివిటిస్ లను ఎదుర్కొవాలి. రచ్చబండ కార్యక్రమం ద్వారా రఘురామ ప్రజల్లోకి వెల్లారు. కర్మ ఎవ్వరినీ వదలదు. మిమ్మల్ని మీ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వారు ఈరోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోతున్నారు. వై నాట్ 175..? మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం వాళ్లకు.. అధికారం మదమెక్కి అహంకారంతో ఉంటే ఇలాగే జరుగుతుందని తెలిపారు.