ధర్మవరంలో జరిగిన గొడవకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కోరారు. అయితే నిన్న ఆయన కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ధర్మవరం ప్రాంతంలో నేరాలకు పాల్పడుతున్న వారిపట్ల నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలి. నిన్నటి రోజున జరిగిన సంఘటనకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరపాలి అని కోరారు. అలాగే ధర్మవరం ప్రాంతంలో ఫ్యాక్షన్ అదుపు చేస్తూ వస్తున్నాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఫ్యాక్షన్ పూర్తిగా నిర్మూలించాం.
కానీ ప్రస్తుతం మళ్లీ అటువంటి పోకడలకు అవకాశం ఇచ్చేలా సున్నితమైన ధర్మవరం లాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ఘటన జరిగే సమయంలో నేను సబ్ జైల్ లో ఉన్నప్పటికీ నాతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే మేము ఏ ఏ సమయంలో జైలుకు వచ్చి వెళ్ళామో జైలు అధికారులను ఆధారాలతో సహా ఇవ్వాలని కోరాం. అయితే నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని కేతిరెడ్డి పేర్కొన్నారు.