Key comments of Jaggampet MLA Jyotula Nehru on volun teers: వాలంటీర్లు కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అంటూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ… వాలంటీర్ల పై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అన్నారు.
వాలంటీర్లకు 10 వేలు ఇచ్చే బదులు గ్రామాల్లో వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటానంటే ఆ అవకాశం వారికి ఇవ్వండి అంటూ కోరారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గ్రామాల్లో సర్వీస్ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నారని…తెలిపారు. సచివాలయ సిబ్బంది ఉన్న తరుణంలో… మళ్లీ వాలంటీర్లు ఎందుకంటూ ప్రశ్నించారు. ఏపీలో వాలంటీర్లు ఉండటం దండగ అని… స్పష్టం చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దీనిపై చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు.