తిరుపతి పరిధి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమపై ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన వరలక్ష్మి… పరీక్షల విషయంలో ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం.
విచారణలో భాగంగా బాధితురాలు వరలక్ష్మికి వైద్య పరీక్షలు నిర్వహించాలని భావించారు పోలీసులు. అయితే.. ఈనకు అనారోగ్యం ఉందని చెప్పిందట వరలక్ష్మి. గుండె నోప్పిగా ఉందని… వైద్య పరీక్షలకు తనకు కోంత సమయం కావాలని పోలీసులు రాతపూర్వకంగా విజ్ఙప్తి చేశారట వరలక్ష్మి. దీంతో వరలక్ష్మి విజ్ఙప్తి మేరకు పోలీసులు.. సమయం ఇచ్చారని సమాచారం.
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వరలో తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. ఊహించని విధంగా సత్యవేడుకు ఉప ఎన్నిక ముంచుకు రావచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.