20 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు : కొడాలి నాని

-

20 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో పేదలకు ఇళ్ల నిర్మాణం దివంగత సీఎం వైఎస్ఆర్ చలువేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇక్కడి ప్రజల 20 ఏళ్ల కళ నెరవేర్చడానికి వచ్చిన CMకు ధన్యవాదాలు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.799 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

పేదలకు రూపాయికే టిడ్కో ఇళ్లను అందిస్తున్నామన్నారు. గుడివాడలో అత్తారిల్లు ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇక్కడ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. CM అవుతానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్…. జగన్ దెబ్బకు MLA కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ‘బిజెపిని కలుపుకున్న ఎమ్మెల్యే అయ్యే పరిస్థితిలో లేడు. హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలత కూడా ఎంపీలుగా గెలిచారు. పవన్ కోరిక అసెంబ్లీలో అడుగుపెట్టడం, చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేత కావడం. జగన్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కదిపే దమ్ము ఎవడికీ లేదు’ అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version