ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని..ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు టిడిపి నేతలపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని.. చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు.
ఎన్టీఆర్ పేరుతో, ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు….ఎన్టీఆర్ ఉంటే పార్టీ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు అంటూ చురకలు అంటించారు. గతిలేక ,రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడు..చంద్రబాబు కుక్క బతుక్కి 2024 ఎన్నికల్లో చెప్పు దెబ్బ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు, లోకేష్ ను తన్ని తరిమి కొట్టి ,ఎన్టీఆర్ వారసులు టిడిపిని స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. దేశమంతా తిరిగిన చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని వెల్లడించారు కొడాలి నాని.