ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు అంటారు.. నిజమే, జీవితంలో కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా ఉండడం చాలా మంచిది. అయితే ఎలాంటి సందర్భాల్లో సైలెంట్ గా ఉండాలనేది తెలియాలి. కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. సైకాలజీ ప్రకారం ఎలాంటి సందర్భాల్లో సైలెంట్ గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
కోపం వచ్చినప్పుడు:
ఏదైనా విషయంలో విపరీతమైన కోపం వచ్చినప్పుడు కొన్ని క్షణాల పాటు సైలెంట్ గా ఉండండి. దానివల్ల మీ మెదడు అసలు నిజంగా కోప్పడలా వద్దా అని ఆలోచిస్తుంది. దీనివల్ల బంధాల మీద ప్రభావం పడకుండా ఉంటుంది.
ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు:
ఒక డిస్కషన్ లో నలుగురైదుగురు వాదులాడుకుంటుంటే సైలెంట్ గా ఉండడం మంచిది. నీవు కూడా వాళ్ళలాగే అరవటం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే.. నువ్వు సైలెంట్ గా ఉన్నావన్న కారణంగా వాళ్లు కూడా సైలెంట్ గా మారిపోయే అవకాశం ఉంది.
నీకు నిజాలు తెలియనప్పుడు:
అందరికీ అన్నీ తెలియాలన్న రూల్ లేదు. కాబట్టి నీకు ఏదైనా విషయంపై సరైన అవగాహన లేకపోతే.. దాని గురించి తెలియదని చెప్పి నిశ్శబ్దంగా ఉండడమే మంచిది. తెలుసని నోటికి వచ్చింది చెప్పి ఆ తర్వాత అబాసు పాలవ్వటం కన్నా మౌనమే మేలు.
విమర్శలు ఎదురైనప్పుడు:
ఏదో ఒక విషయం మీద మిమ్మల్ని ఎదుటివారు విమర్శిస్తుంటే.. అలా కాదు ఇలా అని చెప్పడానికి ప్రయత్నించండి. అయినా కూడా వాళ్ళు వినకుండా విమర్శిస్తూ పోతుంటే.. మౌనం వహించడం మంచిది.
అవతలి వాళ్లు బాధలో ఉన్నప్పుడు:
ఎదుటి వాళ్లు దుఃఖంలో కూరుకుపోయినప్పుడు ఓదార్చే నైపుణ్యం మీకు లేనట్లయితే అక్కడ మాత్రం ప్రయత్నించకండి. ఆ సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.