కొడాలి నాని ఓ పిచ్చికుక్క – వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

-

మాజీ మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి పోలీసు బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. నేడు గన్నవరానికి వచ్చిన ఆయన ఇటీవల దాడికి గురైన టిడిపి కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరంలో టిడిపి ఆఫీసు పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందని ఆరోపించారు. టిడిపి ఆఫీసు పై దాడి చేస్తారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసని అన్నారు.

ఇక కొడాలి నాని ఓ పిచ్చి కుక్క అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి నాని గురించి మాట్లాడితే తన ఇమేజ్ పోతుందని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ ఒక మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ అని, కొడాలి నాని ఒక గ్రామ సింహం అంటూ మండిపడ్డారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా వచ్చే ఎన్నికలలో టిడిపి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకాలు, అవినీతితోనే వైసిపి పాలన సాగుతుందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version