నేడు విజయవాడ NIA కోర్టులో కోడి కత్తి కేసు విచారణ జరుగనుంది. ఈ విచారణ సందర్భంగా సీఎం జగన్ వేసిన రెండు పిటిషన్ల పైన మరల తమ వాదన లను వినిపించనున్నారు ఆయన తరఫు న్యాయవాది. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు సీఎం జగన్.
అడ్వకేట్ కమిషనర్ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అభ్యర్థించారు సీఎం జగన్. ఇక కోడి కత్తి కేసులో కుట్ర కోణంలో విచారణ జరగలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు సీఎం జగన్ తరపు న్యాయవాది. కాగా, నిందితుడు, ఎన్ఐఏ తరఫు వేసిన కౌంటర్ల పైన నేడు కొనసాగనున్నాయి వాదనలు. నిందితుడు జనిపల్లి శ్రీను అలియాస్ కొడికత్తి శ్రీను ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయ వాడ కు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు పోలీసులు.