నెల్లూరు నగర జనసేన ఎమ్మెల్యే గా 2019 లో పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి పై తాజాగా నెల్లూరు లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని ఆ పార్టీ నేత సినీ నటుడు కొణిదెల నాగబాబు తీవ్రంగా ఖంధించారు. తాజాగా అయన స్పందిస్తూ కొంతకాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులపై దాడులు ఎక్కువయ్యాయని మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెబుతుండడమే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. తప్పులు చేసుకుంటూ పోతే అడిగియే హక్కు మాకు లేదా అంటూ ఫైర్ అయ్యారు. తక్షణమే కేతంరెడ్డి పాయ్ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎప్పుడూ ఇలాంటి వారికి అండగా ఉంటుందని కెత్తంరెడీకి భరోసా ఇచ్చారు.