కోడికత్తి కేసు పై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో నేడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే సీఎం జగన్, సిబిఐ, నిందితుడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాగా.. 2019లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన పెను సంచలనంగా మారింది.
పాదయాత్ర పూర్తిచేసుకుని హైదరాబాద్ కి తిరిగి వెళుతున్న జగన్ పై శ్రీనివాస్ దాడి చేసిన ఘటనలో జగన్ భుజానికి చిన్నపాటి గాయమైంది. దీంతో ఆయన వైజాగ్ లో ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలలో ఈ కేసును కోర్టు ఎన్ఐఏ కి అప్పగించింది.