విజయమో.. వీర మరణమో అనే తరహాలో.. జగన్ సర్కార్ పై యుద్దం చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు.రోసా రూల్స్ మార్పు చేర్పులపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలర ప్రతినిధుల సమావేశం ముగిసింది. రోసా రూల్స్ మార్పు చేర్పులపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.
అయితే.. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాం గుర్తింపు రద్దు పై నోటీసిచ్చారు…ప్రభుత్వానికి మాపై ఉక్రోషం ఆగలేదు.. కక్ష తీరలేదు.. దాడి కొనసాగుతోందని మండిపడ్డారు.ఏం ఫర్వాలేదు.. మా పోరాటం కొనసాగుతోంది…నోటీసులివ్వడం ద్వారా మాలాంటి వాళ్లను నియంత్రించలేరని తెలిపారు.
ఉద్యోగ సంఘాలపై దాడులు చేయడం సరైన పద్దతి కాదు…ఇలాంటి చర్యలతో మేం వెనుకడుగు వేసేదే ఉండదన్నారు. యుద్దభూమిలో ఉన్న సైన్యం తరహాలోనే విజయమో.. వీర మరణమో అనే తరహాలో మేం యుద్దం కొనసాగిస్తామని హెచ్చరించారు. వాణిజ్య పన్నుల శాఖలో ఏం జరుగుతోందనే అంశంపై పూర్తి ఆధారాలతో మీ డియా ముందుకు వస్తాం…నోటీసులు పూర్తిగా చదివాక రేపు పూర్తి స్థాయి ప్రెస్ మీట్ పెడతానన్నారు.