మా పోలీసులు లేకుంటే వైసీపీ నేతల తలకాయలు లేపేసేవాళ్ళు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతల దాడిపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రచారం చేసే ఊర్లో కాకుండా వేరే ఊరు వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలానే జరుగుతాయని వెల్లడించారు.

మేము ఉన్నాం కాబట్టే ఆస్తి నష్టం తక్కువ జరిగింది.. ప్రాణనష్టం జరగలేదన్నారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఉంటే వీళ్లు దాడి చేస్తారు.. వీళ్లు ఉంటే వాళ్ళు దాడి చేస్తారని వెల్లడించారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. వూండ్ సర్టిఫికెట్ ఆసుపత్రి వాళ్ళు ఇవ్వలేదు అలాంటప్పుడు కేసు పెట్టగానే నిందితులను ఎలా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు డీఐజీ కోయ ప్రవీణ్.