ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రేపట్నుంచి ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. భూముల ధరలను పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం తుది కసరత్తు చేసింది. భూముల ధరలను పెంచబోతున్నట్టు ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్లకు.. సబ్ రిజిస్ట్రార్లకు అనధికారిక సమాచారం ఇప్పటికే ఇచ్చింది. భూముల ధరల పెంపునకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలని రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఇచ్చే 20 శాతం గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. 30 నుంచి 35 శాతం వరకు పెరిగాయి భూముల ధరలు. గతేడాది భూమి విలువ పెరిగిన కొత్త జిల్లాల్లో కాస్త తక్కువగా పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్ని చోట్లే భూముల ధరలను పెంచాలనే సూచనలు చేశారు. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువ జరుగుతాయో.. ఆ ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.