BRS స్టీరింగ్ ఓవైసీ చేతిలోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. MIM అసద్‌జీ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించవలసిన అవసరం లేదు. అది బీఆరెస్ – కాంగ్రెస్ – ఎంఐఎంల అంతర్గత వ్యవహారం. సయామీ ట్రిప్లెట్స్ పై 3 పార్టీలూ ఎన్నికల ముందో తర్వాతో పొత్తో కూటమో, సర్దుబాటో వారికే తెలుస్తాది, ప్రజలకు కాదు.. స్టీరింగ్ మా చేతిలో ఉంటే దేవాలయాలకు కోట్ల రూపాయల కేటాయింపు ఎట్లా జరుగుతాది అన్న ఓవైసీజీ కామెంట్ మాత్రం పరిశీలించవలసిన అంశం అన్నారు రాములమ్మ.
తమ్ముడు ఈటెల గారు మంత్రిగా కూడా జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతిభవన్ గేటు దాటలేరు. కానీ, బైక్ పై వచ్చిన ఎంఐఎం వంటి టీఆరెస్ సయామీలు లోనికి గౌరవంగా వెళ్లగలుగుతారు. ఇది, ఏ విధమైన అవగాహన అనేది తెలంగాణ ప్రజలకు తెలియదా..? బీఆరెస్ స్టీరింగ్ మా ఎంఐఎం చేతుల్లో ఉన్నదని గతంలో ఎంఐఎం చెప్పినది వాస్తవం… ఆ కామెంట్‌ని బీఆరెస్ ఎన్నడూ ఖండించలేదు. ఇప్పుడు బీఆరెస్ స్టీరింగ్ మా చేతుల్లో లేదు… అని ఎంఐఎం ఎన్నికల సంవత్సరంలో చెప్తాది… అందుకు బీఆరెస్ స్పందన తెలియదు. కాంగ్రెస్ పార్టీ అంపైర్‌గా ఎంఐఎం, టీఆరెస్ చేస్తున్నది కేవలం షాడో బాక్సింగ్ అంతేనని వివరించారు విజయశాంతి.