ఈజ్ ఆఫ్ ఫ్లైయింగ్ పై దృష్టిపెడతాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

-

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రిగా తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు. అలాగే ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖను అప్పగించారు. నరేంద్ర మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.  వాస్తవానికి అత్యంత చిన్న వయస్సు కలిగిన వ్యక్తికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించారంటే గొప్ప విషయం అనే చెప్పాలి. ఆ బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని చెప్పారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిని అమలు చేస్తామన్నారు. 100 డేస్ ప్లాన్.. 2047 వరకు ఏయే ప్లాన్స్ అమలు చేయాలనేది నిర్ణయిస్తాం.

ప్రధాని మోడీ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ చేయాలని అన్ని శాఖలను కోరారు. చంద్రబాబు నాయుడుగారితో సుదీర్ఘంగా పని చేశానని తెలిపారు. ఈజ్ ఆఫ్ ఫ్లైయింగ్ పై దృష్టిపెడతామన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ కూడా విజన్ కలిగిన లీడర్స్.. వీరి విజన్ కోసం పని చేస్తారని తెలిపారు. టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విమాన సౌకర్యాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news