‘అన్​స్టాపబుల్’​లో ‘భగ్​వంత్​ కేసరి’ టీమ్ .. ప్రోమోలోనే ఫుల్ ఫన్.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో..?

-

నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో సీజన్-3 ప్రోమో వచ్చేసింది. ఈ సీజన్ ను బాలకృష్ణ.. తమ మూవీ భగవంత్ కేసరి టీమ్ తో షురూ చేశాడు. ఈ సారి మూడో సీజన్ కాకుండా ‘లిమిటెడ్ ఎడిషన్’ అనే పేరుతో మళ్లీ ఆహా వేదికగా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ప్రసారం కానుంది. తాజాగా అనిల్ రావిపూడి, అర్జున్ రాంపాల్, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఉన్న ఓ ప్రోమో కూడా రిలీజైంది.

“మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు.” అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌తో ప్రోమో షురూ అయింది.  అనిల్​- బాలయ్య మధ్య కొన్ని ఫన్నీ డైలాగ్స్​తో సాగిన ఈ ప్రోమో.. ఇక కాజల్ అగర్వాల్, శ్రీలీల ఎంట్రీతో షో మరింత ఆసక్తిగా మారింది. డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ… అయితే బాలకృష్ణతో చేయాలి? లేకపోతే శ్రీలీలతో చేయాలి అని అంటున్నారు’ అంటూ శ్రీలీలను పొగడ్తలతో ముంచెత్తాడు. ‘నా చందమామ, అందాల ఆడబొమ్మ’ అంటూ కాజల్​కు వెల్​కమ్​ చెప్పాడు. ‘ అక్టోబరు 17న ఈ ఎపిసోడ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version