మందుబాబులకు బిగ్‌ షాక్‌.. పెరిగిన లిక్కర్‌ ధరలు !

-

ఏపీలోని మందు బాబులకు బిగ్‌ షాక్‌. మద్యం ధరలను జగన్‌ ప్రభుత్వం మరోసారి పెంచింది. పన్నుల సవరణ పేరిట క్వార్టర్ సీసాపై రూ. 10, ఫుల్ బాటిల్ పై రూ. 20 వరకు ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. మద్యంపై విధించే ఆదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

Liquor prices increased

ప్రస్తుతం ఏపీఫ్డీసీఎల్ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్ని ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఐఎంఎఫ్ఎల్ ను శాతాల్లోకి మార్చాల్సిన అవసరం ఉందని…. ప్రతిపాదించగా, సర్కారు నుంచి అనుమతి లభించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం…. కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225%, వైన్ పై 200%, ఫారిన్ లిక్కర్ పై 75% ఏఆర్ఈటి ఉంటుందని తెలిపింది. ఫలితంగా మద్యం ధరల పెరుగుదల ఇలా ఉంది. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ. 570 ఉంటే, అది రూ. 590కి పెరిగింది. మరో బ్రాండ్ క్వార్టర్ రూ. 200 నుంచి రూ. 210కి చేరింది. అయితే కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version